Hesperian Health Guides

కరోనావైరస్ — COVID-19




కోవిడ్ -19 అంటే ఏమిటి?

కోవిడ్ -19 అనేది కరోనా వైరస్ వల్ల కలిగే వ్యాధి, ఇది ఒక చిన్న సూక్ష్మక్రిమి (సూక్ష్మదర్శిని లేకుండా చూడటానికి వీళుకానంత చాలా చిన్నది), ఇది ప్రజల మధ్య వ్యాపిస్తుంది. పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , జ్వరం, నీరసం, మరియు ఒంటి నొప్పుల వంటి ఫ్లూ లక్షణాలను కోవిడ్-19 కలుగచేస్తుంది. కోవిడ్ -19 ఎక్కువగా శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. చాలా అంటువ్యాధులు ప్రమాదకరమైనవి కానప్పటికీ, ఇది ఊపిరి తిత్తులను దెబ్బతీస్తుంది మరియు న్యుమోనియా (ఊపిరి తిత్తుల యొక్క తీవ్రమైన వ్యాధి సంక్రమణ) కు కారణమవుతుంది మరియు తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా కావచ్చు.

కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది?

ఒక స్త్రీ తన చేతిలోనికి దగ్గుతుండగా మరొక స్త్రీ సమీపంలో కూర్చుంది

కరోనా సోకిన వ్యక్తి మీ దగ్గర గాలిలో నిశ్వాసించినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, దగ్గు తున్నప్పుడు లేదా తుమ్ముతున్నప్పుడు వెలువడే తుంపరులు మీ నోరు, ముక్కు మరియు కళ్ళ ద్వారా మీ శరీరం లోనికి చేరుతాయి. లేదా మీరు వస్తువుల ఉపరితలాలను తాకి ఆ తర్వాత ఆ చేతులతోనే మీ కళ్ళను, ముక్కును లేదా నోటని తుడుచుకున్నప్పుడు మీ శరీరంలోకి కరోనా వైరస్ ప్రవేశిస్తుంది. చాలా మంది ప్రజలు వ్యాధి బారిన పడిన 5 రోజుల తర్వాత అనారోగ్యంతో బాధపడుతుంటారు, కాని అనారోగ్య లక్షణాలు కనిపించక ముందే కరోనా వైరస్ వారి శరీరంలో ప్రవేశించి ఉండవచ్చు. అనగా మనుషుల శరీరంలో కరోనా వైరస్ 2 నుండి 14 రోజుల వరకు జీవించవచ్చు. మరియు కొంతమంది, ముఖ్యంగా పిల్లలు, వ్యాధి బారిన పడతారు, కానీ వారిలో ఎటువంటి అనారోగ్య లక్షణాలు ఉండవు. కావున ప్రజలు కరోనా వైరస్ ను కలిగి ఉన్నప్పటికి ఆ విషయం వారికి తెలియదు, మరియు వారు ఇతరులకు వైరస్ ను వ్యాప్తి చేస్తారు. బహిరంగ ప్రదేశంలో కంటే ఇంటి లోపల మరియు సమూహాలలో సులభంగా కరోనా వైరస్ వ్యాపిస్తుంది.

కరోనా వైరస్ ఎవరికి సోకుతుంది

కరోనా వైరస్ ఎవరికైనా సొకావచ్చు. ఒకసారి అది సోకి దాని నుండి కొలుకున్నప్పటికి మరొక సారి మీకు తిరిగి సోకవచ్చు, 45 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పెద్దలు, ముఖ్యంగా వృద్ధులు మరియు ఇప్పటికే శ్వాసకోశ వ్యాధులు, మధుమేహం, గుండె సమస్యలు మరియు రోగనిరోధక వ్యవస్థలో లోపం ఉన్నవారికి కోవిడ్ -19 సోకడానికి మరియు మరింత తీవ్రమైన ప్రభావాలను చూపే ప్రమాదం ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఎక్కువ మందికి టీకాలు వేయడం ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తగ్గిపోతుంది.

సంక్రమణను ఎలా నివారించవచ్చు?

ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఒకరికొకరు దగ్గరగా వస్తారు కానీ తాకడం లేదు.
6 అడుగులు
2 మీటర్లు
ఇతరులకు దూరంగా ఉండటం మరియు మాస్క్ ధరించడం వలన మిమ్మల్ని మీరు రక్షించుకోగలరు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించినప్పుడు, తక్కువ మంది కోవిడ్ -19 వ్యాధికి గురైతారు. మీకు మరియు ఇతరులకు కోవిడ్ -19 సంక్రమణను నివారించడానికి టీకాలు వేయడం ఉత్తమ మార్గం.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు లభించే వరకు, ఇంటి వెలుపల ఉన్నప్పుడు మాస్కులు ధరించడం ద్వారా, ఇతరుల నుండి మీరు దూరంగా ఉండడం , మరియు మీ చేతులు మరియు ఇతరులు తాకిన ఉపరితలాలను శుభ్రపరచడం ద్వారా మీ సమాజంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చు. యాంటీబయాటిక్స్ వాడడం వలన లేదా గృహ నివారణల పద్దతుల ద్వారా కరోనా వైరస్ చంపబడదు.

  • మాస్క్ ధరించడం: బహిరంగంగా ఉన్నప్పుడు మాస్క్ లేదా ఇతర ముఖాన్ని కప్పిఉంచే వాటిని ధరించడం మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతాయి. శుభ్రంగా మరియు పొడిగా ఉండే గుడ్డ లేదా కాగితపు మాస్క్ ధరించండి మరియు మీ నోరు మరియు ముక్కును పూర్తిగా కప్పి ఉంచండి మరియు మాస్క్ ను తాకకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒక వ్యక్తికి తెలియకుండానే వ్యాధి సోకుతుంది. ప్రతి ఒక్కరూ సాధారణ గుడ్డతో చేయబడ్డ మాస్క్ ధరించడం వల్ల కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఆపవచ్చు. ముఖాన్ని కప్పి ఉంచడం వేడిగా లేదా అసౌకర్యంగా ఉండవచ్చు. మనల్ని మనం మరియు మన ప్రియమైన వారిని సురక్షితంగా ఉంచడానికి ఆరోగ్య కార్యకర్తలు వాటిని వాడడానికి అలవాటుపడినట్లే, మనం కూడా వాటిని ధరించాలి గుడ్డ మాస్క్ లను క్రమం తప్పకుండా ఉతుక్కోవాలి.
  • బయిటి ఉన్న వ్యక్తుల నుండి మీ ఇంటివారు 2 మీటర్లు (6 అడుగులు) దూరంగా ఉండండి
  • వైరస్ యొక్క పరిమాణం మీకు చేరడాన్ని తగ్గించుటకు ఇతరులతో అవసరమైన పరస్పర చర్యలను ఇంట్లో కాకుండా ఆరుబయటకు తరలించండి. అయినప్పటికీ మీరు ఇంకా మాస్కు ధరించాల్సి ఉంటుంది!
  • సబ్బు మరియు నీటితో మీ చేతులను తరచుగా కడగాలి' లేదా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్-రబ్ ఉపయోగించండి.
    • కనీసం 20 సెకన్ల సబ్బు మరియు నీటితో బాగా కడగాలి, మీ చేతి, మణికట్టు మరియు మోచేయి మొత్తం శుభ్రం చేసుకున్నట్లు నిర్ధారించుకోవాలి .
    • ఇంటికి తిరిగి వచ్చిన వెంటనే, బాత్రూమ్ ఉపయోగించిన తర్వాత, భోజనానికి ముందు, మరియు మీరు దగ్గు, తుమ్ము లేదా మీ ముక్కును చీధిన తర్వాత ఎల్లప్పుడూ చేతులు కడుక్కోవాలి. మొదట చేతులు కడుక్కోకుండా మీ ముఖాన్ని తాకకుండా ఉండండి.
  • మీరు లేదా మీతో నివసించే ఎవరికైనా కరోనావైరస్ సోకి ఉంటే, ఉపరితలాలను శుభ్రపరుచాలి. (కౌంటర్‌టాప్‌లు, ధర్వాజ గొల్లాలు మొదలైనవి) వాటిపై కరోనావైరస్ పేరుకొనిపోయి ఉండవచ్చు, సబ్బు మరియు నీరు, ఆల్కహాల్ లేదా బ్లీచ్ ఉపయోగించి పరికరాలు ఉపరితలాలను శుభ్రపరుచాలి:
    • ఆల్కహాల్: 70% ఉన్న ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కరోనా వైరస్ సూక్ష్మక్రిమిని త్వరగా చంపుతుంది. కౌంటర్‌టాప్‌లను, ధర్వాజ గొల్లాలు మరియు పరికరాల ఉపరితలాలను శుభ్రం చేయడానికి దీన్ని ఉపయోగించండి. 60% నుండి 70% ఆల్కహాల్ బాగా పనిచేస్తుంది; 100% ఆల్కహాల్ ను ఉపయోగించవద్దు ఎందుకంటే సూక్ష్మక్రిములను చంపడానికి నీరు అవసరం. మీ దగ్గర ఉన్న ఆల్కహాల్ 100% గాడత ఉన్నది అయితే, 2 కప్పుల ఆల్కహాల్‌ మరియు 1 కప్పు నీరు నిష్పత్తిలో నీటిని కలుపండి.
    • బ్లీచ్: బ్లీచ్ సాధారణంగా 5% ద్రావణంలో వస్తుంది. విలీనం చేయడానికి చల్లటి నీటిని (వేడి నీరు వాడకూడదు ) కలుపండి. ప్లోర్లను మరియు పెద్ద ఉపరితలాలను శుబ్రపరుచడం కోసం, 5 గాలన్ల బకెట్ నీటిలో 2 కప్పుల బ్లీచ్ ద్రావణాన్ని ఉపయోగించండి (20 లీటర్ల నీటిలో 500 మి.లీ బ్లీచ్).
    • కరోనా వైరస్ కలిగి ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి సంరక్షణ ఇస్తున్నప్పుడు ఒక మాస్క్ ను ఉపయోగించండి. N95 రెస్పిరేటర్ మాస్క్‌లు ఉత్తమమైన రక్షణను ఇస్తాయి. కవాటాలు లేని ఒక మాస్క్ ను ఎంచుకోండి. గుడ్డతో చేసిన మాస్కు ఉపయోగిస్తుంటే, కనీసం 2 లేదా 3 పొరలతో తయారుచేయబడిన మాస్కు ఉపయోగించండి. మాస్కు ను సరిగ్గా ఉపయోగించడానికి:
      • మీ చేతులను ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ రబ్ లేదా సబ్బు మరియు నీటితో శుభ్రం చేసి, ఆపై మీ నోరు మరియు ముక్కును మాస్కుతొ కప్పండి, మీ ముఖం మరియు మాస్కు మధ్య ఖాళీ ప్రదేశం లేదని నిర్ధారించుకోండి.
      • మాస్క్ ధరించేటప్పుడు దాన్ని తాకవద్దు, మాస్కు తడిగా అయితే కొత్త మాస్కు ను వేసుకోండి.
      • మాస్క్ ను తీయడానికి దాని పట్టీలను ఉపయోగించండి (అంతే కానీ మాస్క్ ను మాత్రం తాకవద్దు). మీరు దానిని పారవేసే సమయంలో , మూసి ఉంచిన డబ్బాలో వేయండి. మరియు మీ చేతులను శుభ్రంగా కడుక్కొండి.
      • మీరు తప్పనిసరిగా N95 రెస్పిరేటర్ మాస్క్‌ను తిరిగి ఉపయోగించవలసి వస్తే, దాన్ని క్రిమిసంహారకం చేయడానికి 160 ° F (72 ° C) వద్ద 30 నిమిషాలు వేడి నీటిలో మరుగ బెట్టాలి, లేదా, మీకు కనీసం 5 N95 రెస్పిరేటర్ మాస్క్‌లు ఉంటే, ఒక్కొక్క దానిని ఒక్కో సంచిలో వేభద్రపరిచి వాటి వాడకాన్ని మార్చుతూ ఉండండి, తద్వారా మీరు ప్రతి 5 రోజులకు ఒకసారి మాత్రమే ప్రతి మాస్క్‌ ను ఉపయోగిస్తారు.
    • మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించండి. మీకు పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి లేదా ఒత్తిడి, మరియు జ్వరం ఉంటే, ఎక్కడ మరియు ఎలా చికిత్స పొందాలనే సూచనల కోసం మొదట మీ వైద్యుడిని లేదా స్థానిక ఆరోగ్య అధికారికి కాల్ చేయండి. కోవిడ్ -19 నుండి వచ్చే తీవ్రమైన ప్రమాదం శ్వాస తీసుకోలేకపోవడం, తీవ్రమైన కేసుల చికిత్సలో ఆక్సిజన్ మరియు మెకానికల్ వెంటిలేటర్ అవసరం అవుతాయి. ఇవి ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో మాత్రమే లభిస్తాయి.


    This page was updated:22 జన 2024
"http://te.hesperian.org/w/index.php?title=కరోనావైరస్&oldid=64" నుండి వెలికితీశారు