Hesperian Health Guides

కరోనావైరస్ — COVID-19

Every day 20,000 people visit the HealthWiki for lifesaving health information. If everyone gave just $5 we could translate 50 more chapters.

Make a giftMake a gift to support this essential health information people depend on.


HealthWiki >


కోవిడ్-19 కరోవిరస్ అంటే ఏమిటి?

కోవిడ్-19 అనేది ఒక రకమైన కరోనావైరస్, ఇది ఒక సూక్ష్మ క్రిమి. ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సంక్రమిస్తుంది మరియు వ్యాధికి కారణమవుతుంది. పొడి దగ్గు, శ్వాసలో ఇబ్బంది, జ్వరం, మరియు శరీరం నొప్పి వంటి ఫ్లూ లక్షణాలకు కోవిడ్-19 కారణమవుతుంది. కోవిడ్-19 శ్వాస కోశ వ్యవస్థపై అన్నిటికన్నా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. చాలా కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ ప్రమాదకరమైనవి కాకపోయినా, ఇది న్యుమోనియా (ఊపిరితిత్తులలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) కు దారితీస్తుంది మరియు కొన్ని తీవ్రమైన కేసులు ప్రాణాంతకంగా పరిణమిస్తాయి.

కోవిడ్-19 కరోనావైరస్ ఎలా సంక్రమిస్తుంది?

Corona color Page 1-1.png

వ్యాధి సోకిన వ్యక్తి శ్వాసించడం, దగ్గడం లేదా తుమ్మడం ద్వారా వెలువడిన తుంపరలు నేరుగా మరో వ్యక్తికి చేరుకున్నప్పుడు లేదా ఈ తుంపరల ద్వారా కలుషితమైన ఉపరితలాలు లేదా ఆహారాన్ని తాకడం ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ నోటిద్వారా, ముక్కు ద్వారా, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఒకసారి శరీరంలోకి చేరిన తర్వాత ఈ వైరస్ శరీరంలోని ఇతర భాగాలకు విస్తరిస్తుంది. ఆ వ్యక్తి వ్యాధి చిహ్నాలు మరియు లక్షణాలు చూపే ముందు 2 నుండి 28 రోజుల వరకు శరీరం లోపల నివసించవచ్చు. అప్పుడు, తనకు కరోనావైరస్ సోకిన విషయం ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు , తద్వారా ఇతరులకు ఈ వైరస్ ను వ్యాప్తి చేస్తాడు. కలుషితమైన ఉపరితలాలు మరియు వస్తువులపై కరోనావైరస్ వారం కంటే ఎక్కువ రోజులు జీవిస్తుంది. భౌతికంగా తాకడం ద్వారా ఇది తేలికగా వ్యాప్తి చెందుతుంది.

ఎవరికి కరోనావైరస్ సంక్రమించవచ్చు ?

కరోనావైరస్ వ్యాధి ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేయగలదు. అతనికి ఇప్పటికే ఈ వ్యాధి సోకి మరియు నయం అయినప్పటికీ కూడా, అతను తిరిగి అనారోగ్యం బారినపడవచ్చు. వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న జనాభాలుమరియు మరింత తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్న వారిలో 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వయోజనులు, ముఖ్యంగా సీనియర్లు, ఇతర వ్యాధులు ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా శ్వాసకోశ వ్యాధులు లేదా బలహీన రోగనిరోధక వ్యవస్థలు ఉన్న వారు ఉంటారు.

కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ను మీరు ఎలా నివారించవచ్చు?

కరోనావైరస్ ను నిరోధించడానికి వ్యాక్సిన్ కానీ నయం చేయడానికి ఔషధాలు ఇంకా కనుగొనబడలేదు. యాంటీబయోటిక్స్, గృహోపకర చికిత్సలు ఎలాంటి ప్రభావం చూపవు. అందువలన, వైరస్ తో సంపర్కం నివారించడం మరియు తరచుగా శుభ్రపరుచుకోవడం ద్వారా వైరస్ యొక్క సూక్ష్మజీవులను చంపవచ్చు మరియు కరోనా వైరస్ ను నిరోధించడంసాధ్యమవుతుంది.

  • మీ చేతులను తరచుగా సబ్బు మరియు నీటితో శుభ్రం చేసుకోండి లేదా ఆల్కహాల్ ఉన్న చేతి శానిటైజర్ ని ఉపయోగించండి.
    • మీ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోండి, 20 సెకండ్ల పాటు రన్నింగ్ వాటర్ కింద చేతులను జాగ్రత్తగా రుద్దండి, మీ చేతి గోర్లు, మణికట్టు మరియు మీ మోచేయి కింది భాగంతో సహా మీ మొత్తం చేతులను రుద్దుకోండి.
    • ఆరోగ్య సేవల్ని అందించిన తరువాత, తినడానికి ముందు మరియు దగ్గిన తరువాత, తుమ్మడం లేదా ముక్కు చీదిన తరవాత ప్రతిసారీ శుభ్రపరుచుకొండి.
    • మీ చేతులను ముందుగా కడుక్కోకుండా మీ ముఖాన్ని తాకకూడదు.
  • కరోనావైరస్ తో అస్వస్థతగా ఉన్న వ్యక్తులకు బహిర్గతం అయ్యే ఉపరితలాలను (డోర్ నాబ్ లు, కిచెన్ లోని సామాగ్రి మొదలైనవి) శుభ్రం చేయడం కొరకు ఆల్కహాల్ లేదా క్లోరిన్ వంటి క్రిమినాశకాలను ఉపయోగించండి.
    • ఆల్కహాల్: సాధారణంగా 70% గాఢత వద్ద ఉత్పత్తి అయ్యే ఐసోప్రొపైల్ ఆల్కహాల్, కరోనా యొక్క మైక్రోబ్స్ ను చంపుతుంది. కిచెన్ కౌంటర్ ఉపరితలాలు, డోర్ నాబ్ లు మరియు ఇతర ఉపకరణాల ఉపరితలాలను శుభ్రం చేయడం కొరకు ఆల్కహాల్ ఉపయోగించండి. 60% నుండి 70% గాఢత గల ద్రావణం ఉత్తమంగా పనిచేస్తుంది. 100% గాఢతగల ఆల్కహాల్ ఉపయోగించవద్దు, ఎందుకంటే ఇది పనిచేయదు. ఒకవేళ మీవద్ద 100% ఆల్కహాల్ ఉన్నట్లయితే, దానిని విలీనం చేయాలి, 1 కప్పు నీరు మరియు 2 కప్పుల ఆల్కహాల్ నిష్పత్తి లో కలుపాలి. శుభ్రం చేయడానికి, మొదట సబ్బు మరియు నీటిని ఉపయోగించాలి, తరువాత ఆల్కహాల్ ద్రావణంతో శుభ్రం చేయాలి, మరియు దానికది స్వంతగా, బయట ఆరిపోనివ్వాలి.
    • క్లోరిన్: సాధారణంగా 5% గాఢత గల క్లోరిన్ ను విక్రయిస్తారు. క్లోరిన్ ని డైల్యూట్ చేసే సమయంలో నీటిని విధిగా కలుపాలి (వేడినీరు పనిచేయదు) ప్రతి 20 లీటర్ల నీటికి 2 కప్పులు (అర లీటర్) క్లోరిన్ కలుపాలి . మొదట, మీరు సబ్బు మరియు నీటితో ఉపరితలాలను శుభ్రం చేయాలి, ఆతరువాత వాటిని క్లోరిన్ ద్రావణంతో క్రిమిరహితం చేయాలి, మరియు వాటిని బయట ఆరిపోనివ్వాలి.
  • క్రిమినాశక ద్రావనాలు ఉపయోగించి మీరు తరచుగా తాకే ఉపరితలాలను క్రిమిరహితం చేయండి.
  • డిటర్జెంట్ మరియు వేడినీటితో దుస్తులను ఉతకాలి. వాషింగ్ మెషీన్ ను ఉపయోగిస్తే , సోకింగ్ సైకిల్ ను వాడితే మంచిది.
  • ఒకవేళ మీకు అస్వస్థతగా ఉన్నట్లు అనిపిస్తే మాస్క్ ధరించండి, లేదా కరోనావైరస్ లక్షణాలతో ఉన్న వ్యక్తిని సంరక్షించే సమయంలో ఒక మాస్క్ ధరించండి. ఒకవేళ మీకు అస్వస్థతగా లేనట్లయితే మాస్క్ ని సాధారణంగా ఉపయోగించవలసిన అవసరం ఉండదు . సరిగ్గా ఉపయోగించకపోతే మాస్క్ లు పనిచేయవు:
    • మాస్క్ వేసుకునేముందు, మీ చేతులను ఆల్కహాల్ లేదా సబ్బు మరియు నీటితో శుభ్రం చేసుకోండి.
    • మీ ముఖం మరియు మాస్క్ మధ్య ఎలాంటి అంతరం లేదని ధృవీకరించుకోవడం కొరకు మాస్క్ తో మీ నోరు మరియు ముక్కు కవర్ చేసుకోండి.
    • మాస్క్ ధరించిన సమయంలో దానిని ఎప్పుడు పడితే అప్పుడు తాకవద్దు .
    • మాస్క్ తడి అయితే దానిని మార్చండి.
    • మీరు వాడిన మాస్క్ లను తిరిగి ఉపయోగించకూడదు.
    • మాస్క్ ను తొలగించడానికి తల వెనుక భాగంలో ఉన్న ఎలాస్టిక్ స్ట్రాప్స్ పట్టుకోవాలి (మాస్క్ ను ముట్టుకోకూడదు), మరియు దానిని వెంటనే మూసి ఉన్న డబ్బా లో పారవేయండి మరియు మీ చేతులను శుభ్రం చేసుకోండి.
    • మాస్క్ కు బదులుగా మీ ముఖాన్ని కవర్ చేసుకోవడానికి ఒక గుడ్డను ఉపయోగించకూడదు. మీ శ్వాసతో ఆ గుడ్డ తేమగా ఉంటుంది, వ్యాధికారక బిందువులను తాకడం ద్వారా మీకు ఇన్ఫెక్షన్ సోకడం మరింత సులభతరం అవుతుంది.
  • మీ ఆరోగ్యంపై శ్రద్ధచూపాలి. తుమ్ములతో మరియు పొడి దగ్గు ఉన్న, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్న మరియు జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిని వెంటనే డాక్టర్ గారిని లేదా స్థానిక ఆరోగ్య అధికారులను సంప్రదించాలని సూచించండి, ఆ వ్యక్తి ఎలా ముందుకు సాగాలనే విషయాన్ని చెప్పాలి. కోవిడ్-19 యొక్క అత్యంత తీవ్రమైన లక్షణం, శ్వాస పీల్చుకోలేకపోవడం (అక్యూట్ రెస్పిరేటరీ డిఫికల్టీ సిండ్రోం), చికిత్సలో అవసరమయ్యే ఆక్సిజన్ మరియు యాంత్రిక వెంటిలేటర్ క్లినిక్స్ మరియు ఆసుపత్రులలో మాత్రమే ఉంటాయి.
    • This page was updated:05 మే 2020
"http://fr.hesperian.org/w/index.php?title=కరోనావైరస్&oldid=21" నుండి వెలికితీశారు